'మేమిద్దరం ప్రైవేటుగా మాట్లాడుకున్నాం'.. సీఎం విజయ్ బర్త్‌డే విషెస్ వివాదంపై రజనీ క్లారిటీ!
- తామిద్దరం వ్యక్తిగతంగా మాట్లాడుకున్నామని, ఫోన్లో విషెస్ చెప్పానని వెల్లడి
- 'ధర్మన్' సినిమా ప్రారంభోత్సవంలో మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన తలైవా
- విజయ్ రాజకీయ ఎదుగుదల నేపథ్యంలో రజనీకాంత్‌పై పెరుగుతున్న ఒత్తిడి
సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మధ్య సంబంధాలపై కొంతకాలంగా జరుగుతున్న చర్చకు తాజాగా ఆయన స్వయంగా తెరదించారు. విజయ్ పుట్టినరోజున బహిరంగంగా శుభాకాంక్షలు చెప్పకపోవడంపై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలకు రజనీ క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం వ్యక్తిగతంగా మాట్లాడుకున్నామని, అనవసరమైన ఊహాగానాలకు తావులేదని స్పష్టం చేశారు.
ఇవాళ తన తదుపరి చిత్రం 'ధర్మన్' ప్రారంభోత్సవ కార్యక్రమంలో రజనీకాంత్ పాల్గొన్నారు. ఈవెంట్ ముగిశాక ఆయన వెళ్తుండగా, మీడియా ప్రతినిధులు సీఎం విజయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. దీనికి రజనీ స్పందిస్తూ.. 'మేమిద్దరం అప్పుడే మాట్లాడుకున్నాం' అని తమిళంలో క్లుప్తంగా సమాధానమిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఈ వివాదానికి ఆయన ముగింపు పలికినట్లయింది.
నిన్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన 52వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కమల్ హాసన్, మోహన్‌లాల్, కీర్తి సురేష్, ఖుష్బూ సుందర్, త్రిష వంటి రాజకీయ, సినీ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, రజనీకాంత్ నుంచి ఎలాంటి బహిరంగ ప్రకటన రాకపోవడంతో ఆయన అభిమానులు, నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ జరిగింది.
నిజానికి రజనీకాంత్ ఇలాంటి విమర్శలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మొదట్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ రజనీ మౌనంపై ప్రశ్నలు తలెత్తాయి. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే విజయ్‌కు అభినందనలు తెలిపిన మొదటి వ్యక్తులలో రజనీ ఒకరు. అయినప్పటికీ బహిరంగంగా స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.
ఇటీవలి కాలంలో తమిళనాట రజనీకాంత్, విజయ్ మధ్య పోలికలు పెరిగాయి. రజనీ రాజకీయ ప్రవేశంపై వెనక్కి తగ్గగా, విజయ్ మాత్రం అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ తీసుకునే ప్రతి నిర్ణయం, ఆయన మౌనం కూడా విజయ్‌తో ముడిపెట్టి విశ్లేషణలకు దారితీస్తోంది.